కిరణ్ కొత్త పార్టీ పెట్టరు : దిగ్విజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిరణ్ కొత్త పార్టీ పెట్టరు : దిగ్విజయ్

సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆయన కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని అన్నారు. అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్ ఈ విధంగా స్పందించారు. సీడబ్ల్యూసీ నిర్ణయంతో సీఎం కిరణ్ విభేదించవచ్చని... ఆయనకు ఆ హక్కు ఉందని అన్నారు. కానీ, సీడబ్ల్యూసీ కంటే ఎవరూ ఎక్కువ కాదని తెలిపారు.

More Telugu News