సజావుగా తెలంగాణ ప్రక్రియ.. నెలాఖరులో అసెంబ్లీకి బిల్లు: దిగ్విజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సజావుగా తెలంగాణ ప్రక్రియ.. నెలాఖరులో అసెంబ్లీకి బిల్లు: దిగ్విజయ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని చెప్పారు. సిడబ్ల్యూసీ నిర్ణయానికి ఎవరూ అతీతులు కారంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు దిగ్విజయ్ ప్రతిస్పందించారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారన్నది అవాస్తవమన్నారు. కిరణ్ కరడుకట్టిన కాంగ్రెస్ వాదిగా చెప్పారు. కిరణ్ విభజనకు అంగీకరించారని దిగ్విజయ్ రెండు రోజుల క్రితం ప్రకటించగా.. తాను మారలేదని, సమైక్యవాదినేనని కిరణ్ మీడియా ముందు కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

More Telugu News