శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ సమావేశానికి వెళ్లరాదని ప్రధాని నిర్ణయం
తమిళ రాజకీయ పార్టీల ఒత్తిడికి యూపీఏ ప్రభుత్వం తలొగ్గింది. నవంబర్ 15, 16 తేదీల్లో శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ దేశాధ్యక్షుల సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈయన స్థానంలో భారత బృందానికి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నాయకత్వం వహించనున్నారు. ఈ వివరాలను శ్రీలంకకు రేపు అధికారికంగా తెలియజేస్తారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేకు లేఖ రాయనున్నట్టు సమాచారం.