Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వ్యాపారవేత్త, ఉద్యోగిని ఆఫీసులోనే హత్య

ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో ఉన్న కోటారా తలాబ్ లో దారుణ హత్య జరిగింది. ఆఫీసులోనే యజమాని, ఉద్యోగినిని గొంతు కోసి తుపాకీతో కాల్చి హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బలరాం గుప్తా(48) డిటర్జెంట్ సబ్బులు తయారు చేసే వ్యాపారం చేస్తుంటారు. అతని ఆఫీసులో ఓ మైనర్ బాలిక గీతికా సాహు(17) పని చేస్తుంటుంది. ఆమెను కూడా గొంతు కోసి హత్య చేశారు దుండగులు.

గీతిక ఎంతకూ ఇంటికి రాకపోవడంతో దగ్గర్లో ఉండే ఆమె తల్లి ఆఫీస్ కు వెళ్లి చూసింది. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా బలరాం గుప్తాకు బాగా తెలిసినవారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బలరాం హత్యను గీతిక చూసుంటుందని... అందుకే దుండగులు ఆమెను కూడా చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News