Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మైనర్ పై ఆటోడ్రైవర్ లైంగిక దాడి

పధ్నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మసముద్రం ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. బాలిక తల్లి చిన్నతనంలోనే మృతి చెందడంతో బాలిక అమ్మమ్మ, తాతయ్యల వద్దే ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 3న మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వీరాస్వామి బాలికను మంచినీరు అడిగాడు. తెలిసిన వ్యక్తే కావడంతో బాలిక వంటింట్లోకి వెళ్లగా వెనుకగా వచ్చిన వీరాస్వామి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీంతో బాలిక అరుస్తూ బయటకు వచ్చింది. అనంతరం పొలం నుంచి వచ్చిన అమ్మమ్మ, తాతయ్యలకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి గురువారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఐ కైలాస్ నాథ్ శుక్రవారం సంఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More Telugu News