Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక దాడి కేసు

కర్ణాటక చిక్ మగళూరు జిల్లా శృంగేరి నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత జీవరాజ్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. 2010 మే నెలలో జీవరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిథిలోని కనకిమడబూరు గ్రామ శివారులోని ఓ తోటలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఓ యువతి ఎన్.ఆర్ పురం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసు అధికారులు జీవరాజ్ పై ఐపీసీ 366, 354, 376, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

దీనిపై జీవరాజ్ మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని అంటున్నారు. తమ పార్టీకి చెందిన ఓ నేత మరదలే తనపై కేసు పెట్టిందని, తనకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తోందని లేదంటే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తోందని ఆయన తెలిపారు. విషయాన్ని గతంలో తాను పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లానని ఆయన తెలిపారు. తానే తప్పూ చేయలేదని, నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయని జీవరాజ్ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News