మోడీ ప్రధాని అయితే ఆయనతో కలసి పని చేసేందుకు సిద్ధం : అమెరికా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీ ప్రధాని అయితే ఆయనతో కలసి పని చేసేందుకు సిద్ధం : అమెరికా

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకీ అగ్రరాజ్యం అమెరికా కొన్నాళ్ల నుంచి వీసా ఇచ్చేందుకు తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా, మోడీ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్ ప్రకటించింది. అయితే, మరో అడుగు ముందుకేసిన ఆ దేశ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు.. మోడీ ప్రధాని అయితే ఆయనతో కలసి పనిచేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదన్నారు. ఎన్నికల ఫలితాలను బట్టి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, మోడీ వీసా విషయంలో ఇప్పటిదాకా జరిగిందంతా మీడియా సృష్టేనని అన్నారు. తమ దృష్టిలో ఇది అంత పెద్ద విషయం కాదన్నారు. వీసాకు మోడీ దరఖాస్తు చేసుకుంటే సమీక్షిస్తామని.. అయితే, ఇంతవరకు ఆయన దరఖాస్తు చేసుకోలేదని వివరించారు.

More Telugu News