బీభత్సం సృష్టించిన ఉల్క
సాధారణంగా ఉల్కలు తక్కువ శక్తిని కలిగివుంటాయి. వాటిలో కొన్ని భూమికి సమీపానికి రాగానే మండిపోతాయి. తక్కువ వెలుతురు, వేడితో మండిపోయే ఉల్కల వల్ల ప్రజలకు పెద్దగా ప్రమాదం వాటిల్లదు. కానీ ఇలాంటి వాటికి విరుద్ధంగా సూర్యుడికన్నా ఎక్కువ ప్రకాశంతో పేలిపోయిన భారీ ఉల్క దాడి వల్ల సుమారు 1200 మంది ప్రజలు గాయపడ్డారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రష్యాలో సుమారు 20 మీటర్ల వెడల్పున చెల్యాబిన్స్క్ ఉల్క బీభత్సం సృష్టించింది. ఆరు లక్షల టన్నుల శక్తితో ఈ భారీ ఉల్క విస్ఫోటనం చెందింది. విస్ఫోటన సమయంలో అది సూర్యుడికన్నా దేదీప్యమానమైన వెలుగుతో ప్రకాశించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాల నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.