తొలి టెస్టులోనే సెంచరీ చేసిన రోహిత్ శర్మ
మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసి మాంచి ఊపు మీదున్న ముంబై యువ ఆటగాడు రోహిత్ శర్మ... తన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. దీంతో, ఆరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 14వ భారత బ్యాట్స్ మెన్ గా రోహిత్ అవతరించాడు. 194 బంతుల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. 94 పరుగుల వద్ద ఉన్న రోహిత్... కోట్రెల్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు బాది సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 13 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ 107 పరుగులతో, అశ్విన్ 75 పరుగులతో ఆడుతున్నారు. భారత్ 6 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.