గ్రీన్‌టీలో బోలెడు సుగుణాలున్నాయి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రీన్‌టీలో బోలెడు సుగుణాలున్నాయి

గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ మనకు చాలామందే సలహాలనిస్తుంటారు. ముఖ్యంగా నిపుణులు గ్రీన్‌ టీని తాగమని సూచిస్తుంటారు. గ్రీన్‌టీలో బోలెడు సుగుణాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాలైన క్యాన్సర్‌లనుండి కాపాడడంలో తోడ్పడతాయి.

రోజూ గ్రీన్‌ టీని తాగడం వల్ల గుండె జబ్బులనుండి మనల్ని కాపాడుతుంది. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ పెరుగుదలను నిరోధిస్తుంది. గుండె సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. గ్రీన్‌టీలో తక్కువ కెలోరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని కొలెస్టరాల్‌ను కరిగించడంలో గ్రీన్‌టీ చక్కగా తోడ్పడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది. వయసు పెరుగుదల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావాన్ని గ్రీన్‌టీ తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. గ్రీన్‌టీలో ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే తాగమని నిపుణులు సలహాలనిస్తున్నారు.

More Telugu News