పనిమనిషి హత్య కేసులో ఎంపీకి పోలీస్ కస్టడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పనిమనిషి హత్య కేసులో ఎంపీకి పోలీస్ కస్టడీ

పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతికి ఢిల్లీ న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ధనుంజయ్ సింగ్, జాగృతి పెట్టిన శారీరక హింసకు 35 ఏళ్ల పనిమనిషి రాఖీ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ధనుంజయ్ దంపతులను మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ధనుంజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, జాగృతి ఓ డెంటల్ ఆసుపత్రిలో సర్జన్ గా పని చేస్తున్నారు. ధనుంజయ్ సింగ్, జాగృతిలు పని మనుషులను కర్రలు, ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టినట్టు కేసు నమోదు చేశారు. రాఖీది పశ్చిమ బెంగాల్ కాగా, చికిత్స పొందుతున్న ఇద్దరిదీ ఏ ప్రాంతం అన్నది తెలియరాలేదు. నిందితులు వాడిన ఆయుధాలు, సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

More Telugu News