అంగారక యాత్ర ప్రయోగంలో విఫలమైన జపాన్, చైనా
మార్స్ ఆర్బిటరీ పరీక్ష విజయవంతం కావడంతో భారత్ ఎన్నో దేశాలకు అందనంత ఎత్తుకు చేరుకుంది. టెక్నాలజీలో, అంతరిక్ష ప్రయోగాలలో ఎంతో ప్రగతి సాధించిన జపాన్, చైనాలకు కూడా అంగారక యాత్ర కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. ప్రపంచంలో రాకెట్ టెక్నాలజీ సంపాదించిన అన్ని దేశాలూ... ఈ ప్రయోగాన్ని చేపట్టాలని కలలుగంటున్నాయి.
ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు 51 అంగారక గ్రహ ప్రయోగాలు జరుపగా... వాటిలో 21 మిషన్స్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. మనం చేపట్టిన మొదటి ప్రయోగంలోనే విజయవంతం కావడం అగ్రరాజ్యాలను సైతం ఈర్ష్య పడేలా చేస్తోంది. ఇప్పటి వరకు విఫలమైన వాటిలో... 1999లో జపాన్ చేపట్టిన ప్రయోగం, 2011లో చైనా ప్రయోగం ఉన్నాయి. మన అంగారక యాత్ర సక్సెస్ కావడం... చీటికీ మాటికీ కాలుదువ్వే చైనాకు... కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే దాంట్లో అనుమానమేమీ లేదు.