మరో 32 బస్సుల సీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో 32 బస్సుల సీజ్

మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధమై 55 మంది సజీవదహనమైన ఘోర ప్రమాదం తర్వాత రవాణా శాఖ అధికారులు చేపట్టిన దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిబంధనలను అతిక్రమించి తిరుగుతున్న ప్రైవేటు బస్సులను అధికారులు ఈ రోజు కూడా పట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 5, ఖమ్మం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 3, అనంతపురంలో 2 బస్సులను సీజ్ చేశారు.

More Telugu News