జీవోఎంను లెక్కచేయాల్సిన అవసరం లేదు : సోమిరెడ్డి
సీమాంధ్ర ప్రాంత తెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. అనంతరం తెదేపా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జీవోఎంను లెక్కచేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందని తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలకంటే... రెండు పార్టీలే ముఖ్యమని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని విమర్శించారు. రెండు సార్లు సమావేశమైన జీవోఎం... ఇప్పుడు ఈ మెయిల్ ద్వారా అభిప్రాయాలు పంపమనడం భావ్యమా? అని ప్రశ్నించారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా మెయిల్స్ తో పనేంటని అన్నారు. ఆంటోనీ కమిటీ ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలుగువారి భవిష్యత్తే తమకు ముఖ్యమని సోమిరెడ్డి తెలిపారు.