అమలాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమలాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు కత్తిపోట్లు తగిలాయి. నిన్న అర్ధరాత్రి బస్టాండ్ సెంటర్ లో పినిశెట్టి రవిరాజు, గుండుమొగుల రామారావు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో కత్తిపోట్లకు గురైన వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సెటిల్ మెంట్లే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఇరు వర్గాలకు చెందిన పలువురిని అరెస్టు చేశారు.

More Telugu News