మరోసారి అఖిలపక్ష సమావేశం అవసరం లేదు: కేకే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి అఖిలపక్ష సమావేశం అవసరం లేదు: కేకే

రాష్ట్ర విభజనపై మరోసారి అఖిలపక్ష సమావేశం అవసరం లేదని టీఆర్ఎస్ నేత కేకే అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేయకూడదన్నారు. హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక ఇచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలి ఉండాలని జీఎంవోకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నామని ఆయన వెల్లడించారు.

More Telugu News