ఉద్యోగుల ఆరోగ్య కార్డుల పథకానికి రూ. 400కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్య కార్డుల పథకానికి 400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆరు నెలల పాటు ఈ పథకాన్ని పరిశీలించిన తర్వాత అవసరం మేరకు మార్పులు చేయాలని సూచించారు.