ధావన్ అర్ధసెంచరీ... భారత్ 94
తాడో పేడో తేలిపోయే మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ అదరగొడుతున్నాడు. క్రీజులోకి వచ్చిన దగ్గర్నుంచీ ధాటిగా ఆడుతున్న ధావన్ అర్థసెంచరీ సాధించాడు. 43 బంతుల్లో శిఖర్ ధావన్(50) అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ(31) నిలకడగా ఆడుతూ ధావన్ కు సహకారమందిస్తున్నాడు. దీంతో భారత జట్టు 15 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 94 పరుగులు చేసింది.