నా బిడ్డవి.. నీ బాధ్యతలు నావే: బాధిత కుటుంబానికి మోడీ ధైర్యం
పాట్నా పేలుళ్ల బాధితుల కుటుంబ సభ్యులను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు పరామర్శించారు. ముందుగా పాట్నాలోని గౌరీచంక్ లో రాజ్ నారాయణ్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పేలుళ్లలో నారాయణ్ సింగ్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 5 లక్షల రూపాయల పరిహారాన్ని చెక్ రూపంలో అందించారు. కుటుంబ సభ్యులను పార్టీ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పొగమంచు కారణంగా మోడీ ప్రయాణం 11 గంటల వరకూ మొదలవలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో గోపాల్ గంజ్ పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో హుంకార్ సభ రోజున పేలుళ్లలో మృతి చెందిన బాధితుడి కుటుంబాన్ని మోడీ ఫోన్లోనే పరామర్శించారు. మృతుడి భార్యను తన కూతురిగా భావించి జీవితాంతం బాధ్యతలను స్వీకరిస్తానని మోడీ హామీ ఇచ్చారు. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా సివాన్ నుంచి మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తిరిగి పాట్నాకు మళ్లింది. నాటి పేలుళ్లలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు పేలుళ్ల నిందితులు ఉన్నారు. ఐదుగురు బాధిత కుంటుబాలను మోడీ పరామర్శించడంతోపాటు పరిహారాన్ని అందించారు.