Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ ను పనికిమాలిన పార్టీగా అభివర్ణించిన లగడపాటి

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఓ పనికిమాలిన పార్టీ అని అభివర్ణించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర విభజనను అడ్డుకున్నామని చెప్పారు. మూడోసారి విభజనను అడ్డుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దత్తపుత్రుడు, వేర్పాటు వాదులను నమ్ముకుని 40 సీట్లు సాధించగలమని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తే, అంతకంటే పొరబాటు మరొకటి ఉండదని లగడపాటి అన్నారు. విభజన తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందని తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు.

More Telugu News