Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముజఫర్ నగర్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు

మత ఘర్షణలతో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఘర్షణలతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి జిల్లాలోని కుత్బా ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి పోలీసులు వచ్చారు. నిందితుని కోసం పోలీసులు వెతుకుతుండగా గ్రామస్తులు వారిపైకి రాళ్లు విసిరారు. దీంతో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

More Telugu News