రాత్రికి పాట్నా చేరుకోనున్న మోడీ
వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించేందుకు... బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ బీహార్ రాజధాని పాట్నా వెళ్తున్నారు. ఈ రోజు రాత్రి ఆయన పాట్నా చేరుకుంటారు. రేపు ఉదయం బాధితుల కుటుంబాలను ఓదారుస్తారు. ఇటీవల పాట్నాలో మోడీ బహిరంగ సభ సందర్భంగా వరుస బాంబు పేలుళ్లతో ఆరుగురు చనిపోగా, 80 మంది గాయపడిన సంగతి తెలిసిందే.