మహిళా న్యాయవాదిపై అత్యాచారం
మహారాష్ట్రలోని థానేలో 27 ఏళ్ల మహిళా న్యాయవాదిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల నిందితుడు అజింక్యా విలాస్ భోయిర్ థానేలో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడికి, మహిళా న్యాయవాదికి మధ్య రెండేళ్లుగా స్నేహం నడుస్తోంది. గతవారం అజింక్యా న్యాయవాదిని లోనావాలా రిసార్ట్ కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలతో బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.