అఖిలపక్షం కాదు.. స్వంత పార్టీలో ఏంజరుగుతుందో తెలుసుకోవాలి: ముద్దుకృష్ణమ
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం పెట్టాల్సింది అఖిలపక్ష సమావేశం కాదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ పార్టీ అధిష్ఠానానికి సూచించారు. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోతే ముఖ్యమంత్రి ఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం, బాధితులకు నష్ట పరిహారం ప్రకటించకపోవడం సరైనపనేనా? అంటూ నిలదీశారు. కేంద్రం పెట్టే అఖిలపక్ష సమావేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.