బ్లాక్ కాఫీ చరిత్ర ఏమంటే...
బ్లాక్ ఐవరీ కాఫీ... ఈ పేరు వింటేనే చాలామందికి ఇది చాలా కాస్ట్లీ కాఫీ అని తెలుస్తుంది. ఎంత అంటే ప్రపంచలోనే ఖరీదైన కాఫీ. ఇది కిలో రూ.70 వేల ధర ఉంటుంది. ఏదైనా పెద్ద హోటల్‌కు వెళ్లి ఈ కాఫీ తాగితే ఒక కప్పు కాఫీకి మూడు వేల రూపాయలను వసూలు చేస్తారు. ఇంత విలువైన కాఫీ అన్ని హోటళ్లలో దొరుకుంతుందా? అంటే అదేంకాదు... ఇది ప్రపంచంలోని నాలుగు రిసార్టుల్లోనే దొరుకుతుందట. అందులో మూడు మాల్దీవుల్లో, ఒకటి థాయ్ల్యాండ్లోను ఉంది.
ఇంత కాస్ట్లీ కాఫీ అంత రుచిగా ఉంటుందా? అంటే చాలా రుచిగానే ఉంటుందట. అయితే, దీనికి ఇంతటి రుచి రావడానికి వెనుకున్న చరిత్ర ఏమంటే ఇది ఏనుగు విసర్జితం కాబట్టి... కాఫీ గింజల్లోని ప్రోటీన్లు కాఫీ చేదుకు కారణమవుతాయి. అందుకని ఈ చేదును తగ్గించడానికి కాఫీ గింజలను ముందుగా ఏనుగులకు ఆహారంగా పెడతారు. ఆ తర్వాత ఏనుగులు విసర్జించిన మలంనుండి కాఫీ గింజలను ఏరి వాటిని శుభ్రంచేసి కాఫీగా తయారుచేస్తారట. అంటే ఏనుగుల కడుపులో ఉండే ఎంజైములు కాఫీ గింజల్లోని ప్రోటీన్ల స్థాయిని బాగా తగ్గిస్తాయి. దీంతో కాఫీలోని చేదు తగ్గి చక్కగా రుచిగా ఉంటుందట. ఇంత తెలిసినా బ్లాక్ ఐవరీ కాఫీ తాగాలనుందా... అయితే వెంటనే మాల్దీవులకో, థాయ్ల్యాండ్కో వెళ్లండిమరి!