రజాకార్లను గుర్తు తెస్తున్నారా?: గట్టు
వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు విరుచుకుపడ్డారు. రజాకార్లను గుర్తు తెస్తున్నారా? అంటూ వారిపై మండిపడ్డారు. 'తెలంగాణ మీ అబ్బసొత్తా? లేక మీ అయ్య జాగీరా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై భూస్వామ్య, పెట్టుబడిదారులు చేసిన దురాగతాలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నారా? అని ఆయన దుయ్యబట్టారు. పౌరుల రాజ్యాంగపరమైన హక్కులను కిరణ్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన విమర్శించారు. సోనియా అజెండాను అమలు చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు కొమ్ముకాస్తున్నారని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.