బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం: పోలీసులు
బస్సు డ్రైవర్ ఫిరోజ్ నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లనే డివైడర్ను ఢీకొట్టిందని, దీంతో డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. డ్రైవర్, క్లీనర్ తో పాటు ఐదుగురు ప్రయాణీకులు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారని, మిగిలిన వారంతా బస్సులోనే ఉన్నారని స్థానికులు చెప్పారు. బస్సు డోర్ లాక్ చేసి ఉండటంతో ప్రయాణీకులు ఎక్కువ మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని భావిస్తున్నారు.