కోలుకుంటున్న కేరళ సీఎం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలుకుంటున్న కేరళ సీఎం

లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్ డీఎఫ్) కార్యకర్తల రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కోలుకుంటున్నారు. ఈ మేరకు తిరువనంతపురం మెడికల్ కళాశాల ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, చాందీకి మూడు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాంకు సంబంధించి ఆందోళన నిర్వహిస్తున్న ఎల్ డీఎఫ్ కార్యకర్తలు అదే సమయంలో పోలీసు శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమానికి వస్తున్న సీఎం వాహనంపై రెండు రోజుల కిందట (ఆదివారం) దాడి చేశారు. ఈ ఘటనలో చాందీ నుదుటికి గాయమైంది. ఈ దాడికి పాల్పడిన 22మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News