పారిపోయిన ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్టు
పారిపోయిన ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది అఫ్జల్ ఉస్మానీని తిరిగి అరెస్టు చేసినట్లు ముంబయి యాంటి టెర్రర్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. అహ్మదాబాద్, సూరత్ తదితర బాంబు పేలుళ్ల కేసులో గతంలో అరెస్టైన తీవ్రవాది అప్పటి నుంచి పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే, పేలుళ్ల కేసులో గత నెలలో ముంబయి కోర్టులో పోలీసులు హాజరుపర్చగా, అదే సమయంలో కోర్టు ప్రాంగణంలో రద్దీగా ఉండటంతో ఉస్మానీ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడు. వెంటనే పోలీసులు గాలింపు చేపట్టడంతో ఈ రోజు చిక్కాడు.