చంపేస్తామంటూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు బెదిరింపులు
ఈ మధ్య బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపు ఫోన్స్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా నటుడు అక్షయ్ కుమార్ ను చంపేస్తామంటూ ఫోన్ లో ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడు. అతడు తానో గ్యాంగ్ స్టర్ నని, పేరు రవి పూజారీ అని అక్షయ్ తో చెప్పినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు. తరచూ ఫోన్ చేసి అక్షయ్ ను బెదిరిస్తున్నాడని చెప్పారు. అయితే, ఇదంతా ఆకతాయిగా చేస్తున్నదేనని తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.