విభజనకు కారణం చంద్రబాబు, సోనియా: కొడాలి నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజనకు కారణం చంద్రబాబు, సోనియా: కొడాలి నాని

విభజనకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అని వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు 'గజని' లాంటివాడనీ, తాను గతంలో చేసినవి అన్నీ వెంటనే మర్చిపోతాడని ఆయన ఎద్దేవా చేశారు. 1999 ఎన్నికల్లో బీజేపీతో దోస్తీకి ముందు తెలంగాణకు మద్దతుగా.. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ విభజనకు బీజం వేసింది చంద్రబాబేనని నాని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేసిన దుర్మార్గుడని నాని విమర్శించారు. రాజశేఖరరెడ్డి వ్యక్తిగా మొదలై శక్తిగా ఎదిగారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆయన చనిపోయారన్న ఇంగితం కూడా లేకుండా బాబు తన పెంపుడు కుక్కలతో అనవసర ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడిని, ఆయన పెంపుడు కుక్కలను అడ్డుకునే చేవ తమ పార్టీ నేతల దగ్గర ఉందని అన్నారు. రాజశేఖరరెడ్డి చనిపోయాక 150 మంది శాసనసభ్యులు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని లేఖలిచ్చారని, అందుకే జగన్ ప్రజల్లోకి వచ్చారని నాని తెలిపారు. బాబైతే ఈ 150 మందితో వైస్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి ఉండేవాడని ఎద్దేవా చేశారు.

More Telugu News