ఈ బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేస్తాయట
సాధారణ బ్యాటరీలు కొద్దికాలం మాత్రమే పనిచేస్తాయి. కానీ శాస్త్రవేత్తలు తాము అభివృద్ధి చేసిన కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బ్యాటరీలు ఎక్కువకాలం పాటు పనిచేస్తాయని చెబుతున్నారు. సింగపూర్, చైనాలకు చెందిన శాస్త్రవేత్తలు జావోలిన్ లు, అయిషుయి యు నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఐరన్ ఆక్సైడ్ సూక్ష్మ కణాలతో రూపొందించిన ఎలక్ట్రోడ్లను లిథియం అయాన్ బ్యాటరీల్లో ఉపయోగిస్తే వాటి సామర్ధ్యం పెంచవచ్చని గుర్తించింది.
ఎలక్ట్రిక్ కార్లలో సాధారణ బ్యాటరీలతోకన్నా ఇలాంటి బ్యాటరీలను ఉపయోగించడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఇంతవరకూ ఉపయోగిస్తున్న గ్రాఫైట్, కోబాల్ట్ ఆక్సైడ్ ఎలక్ట్రోడ్లకంటే ఐరన్ ఆక్సైడ్తో తయారుచేసే ఎలక్ట్రోడ్లు చాలా చౌకైనవని, వీటి సాయంతో బ్యాటరీల్లో ఎక్కువ శక్తిని నిల్వచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.