తెలంగాణవైపు కదులుతున్న అల్పపీడనం
అల్పపీడనం రాయలసీమ నుంచి తెలంగాణవైపు కదులుతున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ రెండో స్థాయి హెచ్చరికను జారీ చేసింది. ఇవాళ కూడా కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.