Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండో త్రైమాసికంలో రూ. 2,352 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఐసీఐసీఐ బ్యాంక్

దేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐసీఐసీఐ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రెండో త్రైమాసికంలో అంచనాలను మించి 20.1 శాతం లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2,352 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. పోయినేడాది ఇదే సమయంలో ఐసీఐసీఐ నికర లాభం రూ. 1,960 కోట్లు మాత్రమే.

More Telugu News