హయత్ నగర్-ఘట్ కేసర్ మధ్య రాకపోకలు బంద్
రంగారెడ్డి జిల్లా తట్టన్నారం వద్ద మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. దాంతో, హయత్ నగర్-ఘట్ కేసర్ ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరామ్ కట్టపైనుంచి మూసీ నది పొంగి పొర్లుతోంది. హయత్ నగర్ మండలంలోని బాచారం, గౌరెల్లి, చిన్నరావిరాల, బండరావిరాలలో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు, హుస్సేన్ సాగర్ నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. గరిష్ఠ నీటిమట్టం 513.51 అడుగులు కాగా, ప్రస్తుతం 513.25 అడుగులకు చేరుకుంది.