ఢిల్లీలో నేడూ కొనసాగుతున్న గవర్నర్ భేటీల పర్వం
రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ రెండోరోజు కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈ ఉదయం ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. అంతకుముందు, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. నిన్న పలువురు ఢిల్లీ పెద్దలను కలిసిన నరసింహన్ నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అవుతారని తెలుస్తోంది.