కోటిన్నర విలువైన ఎర్రచందనం పట్టివేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోటిన్నర విలువైన ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వెదురుకుప్పం వద్ద 8 టన్నుల ఎర్రచందనాన్ని కొన్ని వాహనాల్లో తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో కోటిన్నర ఉంటుందని అధికారులు అంటున్నారు. స్మగ్లర్లను పోలీసులకు అప్పగించారు. కాగా, ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనం పట్టుబడడం ఇదే ప్రథమమని అటవీశాఖ అధికారులు చెప్పారు.

More Telugu News