ప్రయాణికుడిపై దాడిచేసి బంగారం దొంగిలించిన ఆటో డ్రైవర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రయాణికుడిపై దాడిచేసి బంగారం దొంగిలించిన ఆటో డ్రైవర్

రాష్ట్రంలో బంగారం చోరీలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విశాఖపట్నం సమీపంలోని డాకమర్రి గ్రామంలో ఈ తెల్లవారుజామున అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికునిపై డ్రైవర్ దాడిచేసి.. అతని వద్దనున్న ఎనిమిది తులాల బంగారాన్ని అపహరించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News