Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ్ఞాపికలేవీ తీసుకురావద్దంటున్న సచిన్

మరికొద్ది వారాల్లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న సచిన్ టెండూల్కర్ తన శ్రేయోభిలాషులకు ఓ సూచన చేశాడు. ముంబైలో జరిగే తన వీడ్కోలు టెస్టు మ్యాచ్ సందర్భంగా, జ్ఞాపికల వంటివేమీ తీసుకురావద్దని విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ మెమెంటోలను స్వీకరించినట్టయితే, వాటిని భద్రపరచడానికి తన నివాసంలో స్థలం సరిపోదని అన్నాడు. కాగా, తనకు భారీ జ్ఞాపికలేమీ ఇవ్వొద్దని సచిన్ కోరాడని, అందుకే అతడికి ఓ పెయింటింగ్ ను బహుకరిస్తామని ముంబయి క్రికెట్ సంఘం వర్గాలు తెలిపాయి. వాంఖెడే స్టేడియంలో వచ్చే నెల 14 నుంచి 18 వరకు విండీస్ తో జరిగే రెండో టెస్టు సచిన్ కెరీర్లో 200వ టెస్టు. ఈ మ్యాచ్ అనంతరం మాస్టర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న సంగతి తెలిసిందే.

More Telugu News