రాందేవ్ తమ్ముడిపై కిడ్నాప్ కేసు.. కుట్రేనంటున్న బాబా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాందేవ్ తమ్ముడిపై కిడ్నాప్ కేసు.. కుట్రేనంటున్న బాబా

యోగా గురువు బాబా రాందేవ్ తమ్ముడు రాంభరత్ పై ఉత్తరాఖండ్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆశ్రమానికి చెందిన ఓ మాజీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి తమ అధీనంలో ఉంచుకున్నారంటూ పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకెళితే.. తన మనవడు నితిన్ త్యాగిని రాంభరత్ కిడ్నాప్ చేశాడంటూ సోమ్ దత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాందేవ్ కు చెందిన పతంజలి యోగపీఠంలో నితిన్ పై దాడి జరిగిందని కన్ఖల్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రమోహన్ నేగి తెలిపారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. దీనిపై బాబా రాందేవ్ స్పందించారు. తన పర్యటనలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయని, అందుకే తనపై కక్ష సాధింపు చర్యగా తన తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన తమ్ముడు తప్పించుకుపోయే వ్యక్తి కాదన్నారు. కాగా, త్యాగి రెండేళ్ల క్రితం 25 లక్షల విలువైన మెషీన్ విడిభాగాలను దొంగిలించాడని రాందేవ్ ప్రతినిధి ఎస్ కే తిజరావాలా వెల్లడించారు.

More Telugu News