కాంగ్రెస్ కు మద్దతివ్వం: దాడి
రాబోయే కాలంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతిస్తామని, కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలను తీసుకుంటామని గతంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కడప ఉప ఎన్నిక సమయంలో యూపీఏకు మద్దతిస్తామని జగన్ చెప్పారని, అయినప్పటికీ సోనియా కక్షసాధింపు చర్యలకు పాల్పడి జగన్ ను జైల్లో పెట్టించారని అన్నారు. జైలుకు వెళ్లక ముందు చెప్పిన మాటకు మనుగడ లేదని, తాము కాంగ్రెస్ కు మద్దతివ్వబోమని దాడి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే వైఎస్సార్సీపీ ఏర్పాటైందన్నారు.