Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి రాజీనామా చేసిన లగడపాటి

లోక్ సభ సెక్రటరీ జనరల్ కు మరోసారి లగడపాటి రాజగోపాల్ రాజీనామా లేఖ అందజేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాను స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి లేకుండా రాజీనామా లేఖ అందజేస్తున్నానని అన్నారు. తన రాజీనామాను ఈసారి ఆమోదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోనే రాజీనామా సమర్పించానని, తాజాగా అన్నీ దృష్టిలో ఉంచుకుని రాజీనామా చేస్తున్నానని అన్నారు. తనకు మరొకరితో సంబంధం లేదని, రాజీనామా అనేది తన స్వంత నిర్ణయమని లగడపాటి స్పష్టం చేశారు.

More Telugu News