విభజనపై రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖలు రాశాం: శైలజానాథ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజనపై రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖలు రాశాం: శైలజానాథ్

రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల్ని పాటించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు లేఖలు రాసినట్టు సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ రాష్ట్ర మంత్రి శైలజానాధ్ తెలిపారు. ఉద్ధృతంగా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని మంత్రి అన్నారు. అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాన్నీ విభజించలేదని శైలజానాథ్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అంశం రాష్ట్ర అసెంబ్లీకి ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు.

More Telugu News