ఏపీ భవన్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏపీ భవన్ గేటుకు తాళం వేసి టీడీసీ కార్యకర్తలను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కార్యకర్తలతో పాటు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గేటు వద్ద భైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీలను, ప్రజాప్రతినిధులను కూడా లోపలికి అనుమతించడం లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీలు కట్ చేశారని, కనీసం తాగునీరు కూడా లేకుండా చేశారని ఆరోపించారు. ఏపీ భవన్ అధికారులు తెలుగువారి ఆత్మాభిమానాన్ని అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు.