'ఫేస్ బుక్' పుట్టినరోజు పండుగ
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని తన కుటుంబంలో చేర్చుకున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఫేస్ బుక్' 9వ పుట్టిన రోజు సంబరాల్లో మునిగిపోయింది. 2004, ఫిబ్రవరి 4న నలుగురు హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్ధులు 'ఫేస్ బుక్'ను ప్రపంచం ముందుకు తెచ్చారు. ఇంతై వటుడింతై అన్నట్లు ... అది నేడు 100కోట్ల మందికి పైగా సభ్యులతో వర్ధిల్లుతోంది.
తమ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య పరిచయం కోసం హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్ధులు మార్క్ జుకెర్ బర్గ్, అతని మిత్రులు ముగ్గురు కలిసి చేసిన వినూత్న ప్రయత్నం ఇది. ఎప్పటికప్పుడు కొత్తగా చేరే విద్యార్థులు తోటి వారితో పరిచయానికి అనుసంధాన వేదికగా వీరు 'thefacebook.com' సైట్ ను ప్రారంభించారు. ప్రారంభంలో ఇది వీరి కోసం మాత్రమే ఉద్దేశించింది. తర్వాత దీనికి చక్కటి ఆదరణ రావడం, తమ ప్రయత్నం సఫలం కావడంతో అమెరికాలోని పలు ఇతర కళాశాలలకు దీన్ని విస్తరించారు. చివరికి 2004, ఫిబ్రవరి 4న 'facebook.comగా పేరు మార్చి ఈ సైట్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
ఇక అప్పటి నుంచీ ఇది కోట్లాది మందిని ఏటేటా చేర్చుకుంటూ జగమంత కుటుంబంలా పెరిగిపోతూనే వుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. అమెరికాలో ప్రతి ఇద్దరిలోనూ ఒకరు ఫేస్ బుక్ సభ్యులే. మనదేశంలో 15 కోట్లమంది దీనిని వినియోగిస్తున్నారు. అమెరికా తర్వాత ఎక్కువమంది సభ్యులున్న దేశం మనదే కావడం విశేషం!