ఎక్కువమంది నెటిజన్లు వెదికింది ఆయన గురించే: గూగుల్
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఓ సర్వేకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇంటర్నెట్లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసింది గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించే అని గూగుల్ తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ ఉన్నారు. అంతేగాకుండా, వచ్చే ఎన్నికల్లో 167 లోక్ సభ స్థానాల ఫలితాలను సోషల్ మీడియా ప్రభావితం చేయనుందని గూగుల్ అభిప్రాయపడింది. ఇక పార్టీల విషయానికొస్తే బీజేపీ గురించే నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేశారట. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, శివ్ సేన ఉన్నాయి.