చాన్సు దొరికితే మలాలాపై మరోసారి దాడి చేస్తాం: తాలిబాన్లు
పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో బాలికల విద్య కోసం పాటుపడుతున్న సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ పై మరోసారి దాడికి సిద్ధమని తాలిబాన్లు ప్రకటించారు. ప్రపంచం అనుకుంటున్నట్టుగా ఆమె పెద్ద ధైర్యవంతురాలేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు. తెహ్రీకే తాలిబాన్ ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ ఏఎఫ్ పీ మీడియా సంస్థతో మాట్లాడుతూ, మరోసారి అవకాశం లభిస్తే ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇస్లాంకు, తాలిబాన్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆమెపై ఇంతకుముందు గుళ్ళవర్షం కురిపించామని తెలిపారు. గతేడాది అక్టోబర్ 9న స్వాత్ లోయలో పాఠశాలకు వెళుతుండగా మలాలా ఉన్న స్కూలుబస్సుపై తాలిబాన్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా లండన్ లో చికిత్స పొంది ప్రాణాపాయం తప్పించుకుంది.