తెలంగాణ విద్యుత్ జేఏసీ నేత రఘు అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ విద్యుత్ జేఏసీ నేత రఘు అరెస్టు

హైదరాబాదులోని విద్యుత్ సౌధలో 48 గంటల రిలే దీక్ష చేస్తున్న తెలంగాణ విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణ ప్రాంత విద్యుత్ సౌధ ఉద్యోగులు కార్యాలయం గేటు ఎదుట బైఠాయించారు. ఆందోళనకు దిగిన ఉద్యోగులతో పోలీసులు చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, రఘును అరెస్టు చేస్తే అగ్నిగుండమే అని నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు.

More Telugu News