Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే ఎన్నికల నుంచే ఓటరుకు రశీదు

2014 ఎన్నికల నుంచే 'ఓటుకు రశీదు' విధానం అందుబాటులోకి రానుంది. 2014 ఎన్నికల నుంచి ఓటరుకు రశీదు విధానాన్ని దశల వారీగా ప్రవేశపెట్టాలని ఎలక్షన్ కమిషన్(ఈసీ)ను సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించింది. పారదర్శకత, వివాదాల తొలగింపునకు ఈ విధానం దోహదపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. వోట్ వెరిఫైయర్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ)ను ప్రవేశపెట్టేందుకు వీలుగా నిధుల సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం పై ఆదేశాలు వెలువరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగాలాండ్ ఎన్నికల్లో 21 పోలింగ్ కేంద్రాలలో వీవీపీఏటీ విధానాన్ని విజయవంతంగా అమలు చేసి చూశామని అంతకుముందు ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వివరించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలంటే 1500కోట్ల రూపాయలు అవసరం అవుతాయని నివేదించింది.

More Telugu News