సీఎం ముందు ఆజాద్ అసంతృప్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం ముందు ఆజాద్ అసంతృప్తి

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆజాద్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ డిల్లీలో సమావేశం అయ్యారు. కొద్ది సేపటి క్రితం డిల్లీ చేరుకున్న అయన విమానాశ్రయం నుంచి నేరుగా ఆజాద్ నివాసానికి వెళ్ళారు. తెలంగాణ, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ సాధిం
చిన ఫలితాలపై వివరాలు కూడా అందించినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే శంకర్ రావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. డిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేంద్ర హోం మంత్రి షిండేతో కూడా సమావేశం అవుతారు. 

More Telugu News